Sankranthiki Vastunnam Collections: సరికొత్త రికార్డ్స్ సృష్టించిన వెంకీమామ.. భారీ మైల్డ్ స్టోన్ దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం..

2 hours ago 1

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. అడియన్స్ ఊహలకు మించి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ జోడిగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే వెంకీమామ కెరీర్ లోనే హాయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా భారీ మైల్ స్టోరీ దాటింది. దీంతో ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచిన హీరోలలో వెంకటేశ్ రికార్డ్ సృష్టించారు.

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.303 కోట్ల గ్రాస్ రాబ్టట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అంటూ పేర్కొంది. 20 రోజుల్లోనే దాదాపు రూ.303 కోట్లు సాధించి బాక్సాఫీస్ షేక్ చేసింది ఈ మూవీ. కేవలం రూ.50 కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందించిన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొట్టేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అటు మేకర్స్.. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు సైతం లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ సైతం నిర్వహించారు. ఈ చిత్రంతో భారీ లాభాలను గడించామని వెల్లడించారు. ఈ వేడుకలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సైతం పాల్గొన్నారు.

HISTORY HAS A NEW NAME!LEGACY HAS A NEW BENCHMARK! #SankranthikiVasthunam sets the barroom SO HIGH with a RECORD-BREAKING RAMPAGE🔥❤️‍🔥

₹303 CRORE+ worldwide Gross & #BlockbusterSankranthikiVasthunam continues it’s DOMINATION astatine the container bureau 💥💥

ALL TIME INDUSTRY HIT FOR A… pic.twitter.com/NA0THATePy

— Sri Venkateswara Creations (@SVC_official) February 3, 2025

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article