దేశంలో పాములను పూజించేవాళ్ళని చూశాం. పాము కనిపిస్తే చంపేవాళ్ళని కూడా చూశాం. గుడిలో కనిపిస్తే దైవం, పొలంలో కనిపిస్తే భయం. రెండు చోట్లా పాము ఒకటే. కానీ చూసే విధానంలోనే మనకు ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? అసలు పాముల స్వభావం ఎలా ఉంటుంది? మనుషులకు ఉన్నట్టే పాములకు కూడా పగ, ప్రతీకారాలు లాంటివి ఉంటాయా? భక్తుల విశ్వాసం నిజమా? సైన్స్ చెప్తుంది ఏంటి..?
Snakes
Updated on: Feb 07, 2025 | 8:36 PM
పాము కనిపిస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు. మరికొందరు వెంటాడి చంపేస్తారు ఇంకొందరు. అయితే మనుషులకు ఉన్నట్టే పాములకు పగలు, ప్రతీకారాలు ఉంటాయా? అసలు పగ పట్టేంత జ్ఞాపకశక్తి పాములకు ఉంటుందా? అనేది బిగ్ టాపిక్. పామును దేవతలా కొలిచే భక్తులు పగలు, ప్రతీకారాలు ఉంటాయని నమ్ముతారు. వాటికి ఆపద తలపడితే ఖచ్చితంగా వెంటాడతాయంటారు. ఒకసారి పగపడితే ఆ వ్యక్తి చనిపోయేవరకూ వెంటాడుతూనే ఉంటాయని కొందరి వాదన. పాము తలపై అత్యంత విలువైన మణులు ఉంటాయని నమ్మకం కూడా. అవన్నీ మూఢనమ్మకమని హేతువాదులు చెబుతుంటారు. అసలు పగపట్టేంత మైండ్ సెట్ పాములకు ఉండదనేది వారి వాదన. పాములకు ఎలాంటి అతీంద్రియ శక్తులు, జ్ఞాపకశక్తి లేదని సైన్స్ చెప్తున్న నిజం. పాములకు జ్ఞాపకశక్తి తక్కువ. పుట్టలో నుంచి బయటకు వచ్చిన పాము ఒక్కోసారి తన పుట్ట ఎక్కడో మర్చిపోతాయంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. తమ ఆత్మరక్షణ కోసం అంటే ఎవరో తమకు హాని తలపెడుతున్నారనే తలంపుతో కాటు వేస్తాయి తప్ప పాములు పగబట్టేదానికి అవకాశమే లేదంటున్నారు నిపుణులు.
కేవలం నేల మీద ఉన్నటువంటి వేవ్స్ ఆధారంగానే పాముల చలనం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఇటువంటి గ్రహణశక్తి, జ్ఞానశక్తి లేదు. సైంటిఫిక్ గా దీన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగింది. కేవలం మూఢనమ్మకం మాత్రమేనని పాములపై రీసెర్జులు చేసిన ప్రొఫెసర్స్ చెబుతున్నారు. అవి పగబట్టే అవకాశమే లేదని.. అనేక పరిశోధనలు కూడా ఇదే చెప్పాయి.
ఇక పాములు ఇంట్లోకి వస్తే చాలామంది వాటిని చంపేస్తారు. కానీ అలా చంపొద్దంటున్నారు జంతు ప్రేమికులు. స్నేక్ క్యాచర్స్ కు సమాచారం ఇస్తే పామును పట్టుకెళ్లి సేఫ్ గా వదిలేస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలావరకు పాములు కాటేస్తాయి. కానీ కాటేసినవన్నీ విషపురితం కాదు. కేవలం కొన్ని సర్పాలు మాత్రమే విషం వదులుతాయి. ఒక్కోసారి విషసర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు. ఎందుకంటే అది ఆహారం తీసుకున్న నాలుగు ఐదు గంటల వరకు విషం విడుదలవదు. ఆ సమయంలో మనిషిని కాటు వేస్తే విషం ఎక్కదు. కాబట్టి పాముల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు జంతు ప్రేమికులు. ఎక్కడైతే పాములు కనిపించినా చంపొద్దని వేడుకుంటున్నారు. పాము ఏదైనా అపాయంలో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స అందించాలనేది స్నేక్ లవర్స్ రిక్వెస్ట్.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..