ప్రముఖ నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంబాబ్ లోని లూథియానా కోర్టు. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబయిలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లూథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూ సూద్ కు సాక్షిగా పేర్కొన్నారు. కానీ అతడు సమాధానం చెప్పడానికి రాలేదు.
దీంతో అతడికి లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. లూథియానా కోర్టు తన ఉత్తర్వులో, ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారా పోలీస్ స్టేషన్ అధికారిని సోను సూద్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. “సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతడు హాజరుకాలేదు. దీంతో అతడిని వెంటనే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది” అంటూ ఉత్తర్వ్యూలో పేర్కొంది కోర్టు.
సోనూ సూద్..తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వంతో చాలా మందిని ఆదుకుని రియల్ హీరోగా మారాడు. ఇన్నాళ్లు నటుడిగా అలరించిన సోనూసూద్.. ఇప్పుడు దర్శకుడిగా మారి ఫతేహ్ అనే సినిమాకు తెరెకెక్కించారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన