సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ఎక్కడికైనా వెళుతున్నారంటే తోడుగా కుటుంబ సభ్యులు లేదా బాడీ గార్డులు కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎంతో హడావిడి చేస్తుంటారు. అయితే ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మాత్రం ఎవరికీ తెలియకుండా ఎలాంటి హడావిడి లేకుండా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది.
Tollywood Actress
ముద్దుగుమ్మ, సినీనటి, సంక్రాంతికి వచ్చేస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి శ్రీశైలంలో మిల మిల మెరిసిపోయారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం భ్రమరాంబ దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పలువురు భక్తులు ఆమెను గుర్తించి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత పాతాళ గంగ బోట్ లో మీనాక్షి షికారు చేశారు. శ్రీశైలం ప్రకృతి అందాలకు పరవశించిపోయారు. ఎవరికి తెలియకుండా రావడంతో ఎలాంటి హడావుడి లేదు. ప్రస్తుతం మీనాక్షి శ్రీశైలం ఆలయ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. సంక్రాంతికి వచ్చేస్తున్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో మీనాక్షి చౌదరి..
ఇవి కూడా చదవండి