Telangana Caste Census Survey: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్‌పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. కులగణన సర్వే రిపోర్ట్ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
2014లో నిర్వహించిన సమగ్ర సర్వేలో 11 శాతం ఉన్న OC జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో 15.79 శాతానికి పెరిగిందని.. బీసీలు, ముస్లింలతో పోలిస్తే OC జనాభా ఎక్కువ ఎలా పెరిగిందని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. EWS రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడటానికే.. సర్వే రిపోర్ట్‌లో BC జనాభా తగ్గించి OC జనాభా పెంచారని ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలపై ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు, బీసీ సంఘాలు చెబుతున్న లెక్కలను పరిశీలిస్తే..
– 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో 18శాతం ఉన్న SC జనాభా ప్రభుత్వ సర్వే ప్రకారం 17.43 శాతానికి తగ్గిందని.. అంటే ఎస్సీ జనాభా 0.57 శాతం తగ్గిందని బీసీ సంఘాలు అంటున్నాయి.
– 10శాతం ఉన్న ST జనాభా ప్రభుత్వ సర్వే ప్రకారం 10.48 శాతానికి పెరింగింది. అంటే ఎస్టీ జనాభా స్వల్పంగా 0.48 శాతం పెరిగింది.
– 8శాతం ఉన్నOC జనాభా 13.31 శాతానికి పెరిగింది. అంటే 5.31 శాతం ఓసీ జనాభా పెరిగింది.
– 51శాతం ఉన్న BC జనాభా 46.25 శాతానికి తగ్గింది.
– 13 శాతం ఉన్న ముస్లిం జనాభా 12.56 శాతానికి తగ్గింది.
– 10 శాతం ఉన్న BC ముస్లిం జనాభా 10.08 శాతానికి పెరిగింది.
– 3 శాతం ఉన్న OC ముస్లిం జనాభా 2.48 శాతానికి తగ్గింది.
-ప్రభుత్వ సర్వేలో బీసీల జనాభా తగ్గి.. ఓసీల జనాభా ఎలా పెరిగిందని.. జనాభా పెరుగుదల సగటు అన్ని కులాలలో ఒకేలా ఉండాలని ఓసీలతో పోలిస్తే ముఖ్యంగా సహజంగా బీసీలలోనే జనాభా పెరుగుదల ఎక్కవ ఉండాలని.. కానీ ప్రభుత్వ సర్వే లెక్కలు దీనికి విరుద్ధంగా ఉన్నాయంటున్నాయి బీసీ సంఘాలు. -EWS రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడటానికే.. సర్వే రిపోర్ట్‌లో BC జనాభా తగ్గించి OC జనాభా పెంచి చూపించారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
-2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.5 కోట్లు
-2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జనాభా 3.63 కోట్లు
-2024 ప్రభుత్వ కులగణన సర్వే ప్రకారం జనాభా 3.54 కోట్లు
-జనాభా వృద్ధి రేటు ప్రకారం పదేళ్ల తర్వాత జనాభా పెరగాలి కానీ ఎలా తగ్గింది?
-దీన్ని బట్టే ప్రభుత్వ కులగణన సర్వే లెక్కలు తప్పు అని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వాదిస్తోంది.
ఈ సందర్భంగా కులగణనపై అసెంబ్లీలో వాడివేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే చరిత్రాత్మకమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలఅమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారాయన. అందుకే కులగణన సర్వే రిపోర్ట్‌ని కేబినెట్‌లో ఆమోదించి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు
కులగణన సర్వేపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. కులాల జనాభా లెక్కల్లో ఇన్ని తేడాలు ఎందుకని ప్రశ్నించారు మాజీమంత్రి తలసాని. సర్వే సందర్భంగా తన ఇంటికి రెండు స్టిక్కర్లు అంటించారని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక కులగణన సర్వే నివేదికను సభలో టేబుల్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. అయితే వీరికి సమాధానం ఇచ్చారు మంత్రులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి