యూజ్ చేయడానికి ప్లాస్టిక్ ఎంత కన్వినియంటో దాన్ని వదిలించుకోవడం అంత కష్టం. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతటి పెనుముప్పుగా మారిందో మన కళ్లెదుటే కనిపిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని, తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నా వదిలించుకోలేని పరిస్థితి. మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారింది. మట్టిలో ప్లాస్టిక్ కలిసి పోవాలంటే వందల ఏళ్లు పడుతుంది. అందుకే ఏ చెత్త కుప్ప దగ్గర చూసినా ప్లాస్టికే కనిపిస్తుంది.
మానవ కోటి ప్రాణాలకు ప్లాస్టిక్ అనేది ఎంతో ముప్పొ తెలిసినా కూడా ప్లాస్టిక్ వాడకం అనేది మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది..ప్లాస్టిక్ లేకుండా మనం ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో ప్రతి ఫంక్షన్‌లో ప్లాస్టిక్ వాడడం అనేది తప్పనిసరి అయిపోయింది. ప్లాస్టిక్ లేకండా ఫంక్షన్ పూర్తి చేయడం అనేది చాలా కష్టం. నూటికో కోటికో ఒక్కరు మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకూడదు అని అనుకుంటారు. అది చాలా కష్టం. కానీ ఒక కుటుంబం మాత్రం ప్లాస్టిక్ అనేది వాడకుండా పెళ్లి చేసి చూపించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ వివాహ వేడుకలో ఏమాత్రం ప్లాస్టిక్ వాడకుండా వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దుబ్బాక మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంఘం పద్మ-మధుసూదన్ రెడ్డి కుమారుడు ప్రేమ్‌చందర్ రెడ్డి విహహం పట్టణంలోని ఓ గార్డెన్స్ లో సోమవారం(ఫిబ్రవరి 3) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహంలో పర్యావరణ పరిరక్షణ,చైతన్యం తెచ్చేలా వివాహం జరిపించారు. పెళ్లికి స్వాగతం తొరణాల నుండి మొదలు భోజనాల వరకు ఎక్కుడా కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు. తినే ప్లేట్లకు బదులు అరటి ఆకులు, తాగే నీటికి ప్లాస్టిక్ గ్లాస్ బదులు, గాజు గ్లాసులు వాడారు. పెళ్లికి వచ్చిన వారికి జ్యుస్ ని కూడా మట్టి ముంతల్లో ఇచ్చారు.
వీడియో చూడండి..
ఈ పెళ్లికి వచ్చిన వారందరు ఈ ప్లాస్టిక్ రహిత పెళ్లి వేడుకను చూసి వధువు వరులను వారి తల్లిదండ్రులను అభినందించారు. వివాహ వేడుకలో ప్లాస్టిక్ నివారణ గురించి చైతన్యం కల్పించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంతటి అనర్దాలు వాటిల్లుతాయో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చిన వారందరికి అవగాహనా కల్పించారు. నిజంగా ఇలా ప్లాస్టిక్ లేకుండా పెళ్లి చేయడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..