ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మొదట సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలతో పాటు.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారు. కులగణన పూర్తి నివేదికతో పాటు ఎస్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను సభలో సభ్యులకు అందించి చర్చించనున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ కాపీని కేంద్రానికి పంపుతారు. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో రిలీజ్చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకోనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతోపాటు కులగణన వివరాలను తీసుకొని, ఫైనల్ సిఫారసులు చేసే అవకాశం ఉంది. ఇందుకు నాలుగైదు రోజులు సమయం పడుతుందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్ కమిషన్ కొత్త రిజర్వేషన్లను రికమండ్ చేయనుంది. సభలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ కులగణన రిపోర్ట్ ఒకసారి చూస్తే..
రాష్ట్రంలో బీసీల జనాభా ఒక కోటి 64లక్షల 09వేల 179మందిగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 46.25శాతంగా ఉన్నారు. ఎస్సీల జనాభా 61లక్షల 84వేల 319మంది.. 17.43శాతంగా ఉన్నారు. ఎస్టీల విషయానికి వస్తే రాష్ట్రంలో 37లక్షల 5వేల 929మంది ఎస్టీలుండగా.. వారు 10.45శాతంగా ఉన్నారు. బీసీ మైనార్టీ ముస్లింలు 35లక్షల 76వేల 588మంది ఉన్నారు. ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం జనాభా 56.33 శాతంగా తేల్చారు. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం, ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతంగా ఉందని.. రిపోర్ట్‌లో తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి