జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ ఎస్ఐతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.
Si Swetha
అతివేగానికి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ ఎస్ఐతోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత గొల్లపల్లి నుంచి జగిత్యాలకు వస్తుండగా, చిల్వాకోడూర్ దగ్గర బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. ఆమెతోపాటు బైక్‌పై వస్తున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..