పై ఫొటోలో పేరెంట్స్ తో ఉన్న చిన్నిబాబును గుర్తు పట్టారా? ఆ అబ్బాయి టాలీవుడ్ లో ఫేమస్ హీరో. సినిమా ఇండస్ట్రీలో బలమైన నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు. అయితే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే ఈ హీరో కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలున్నాయి. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో పాటు మాస్ సినిమాలకు సరిగ్గా సరిపోతాడీ మ్యాన్లీ హీరో. కేవలం సోలో హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఈ నటుడు మెప్పించాడు. అయితే గత15 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా స్టార్ నటుడిగా మాత్రం ఎదగలేకపోయాడు. యాక్టింగ్ పరంగా ఏ వంక పెట్టలేకున్నా ఎందుకో గానీ ఇతర హీరోలతో పోలిస్తే బాగా వెనకబడిపోతున్నాడు. మరి ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు అక్కినేని నాగార్జన మేనల్లుడు సుశాంత్. మంగళవారం (ఫిబ్రవరి 11) సుశాంత్ తండ్రి సత్య భూషణ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయనతో చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడీ హ్యాండ్సమ్ హీరో. ఇందులో చాలా క్యూట్ గా కనిపించాడు సుశాంత్.
కాగా సుశాంత్ తండ్రి 2017లో మరణించారు. ఇక సుశాంత్ తల్లి నాగ సుశీల నాగార్జునకు స్వయానా సొంత అక్క. 2008లో కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. ఆ తర్వాత కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాంరా, చిలసౌ, ఇచ్చట వాహనములు నిలపరాదు తదితర సినిమాలతో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి
పేరెంట్స్ తో అక్కినేని సుశాంత్..
అలవైకుంఠపురంలో, భోళా శంకర్, రావణాసుర సినిమాల్లో నూ కీలక పాత్రలు పోషించాడు సుశాంత్. అలాగే మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించాడు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాల గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది.
అక్కినేని సుశాంత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.