ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఇప్పటివరకు కేవలం రెండంటే రెండు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అందులో ఒకటి యావరేజ్ కాగా మరొకటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ. దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమాలో ఈ అందాల తారకు అవకాశం దక్కించి. క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కే ర్యాంప్ లో ఈ ముద్దుగుమ్మకు కథానాయికగా అవకాశం లభించింది. దీంతో ఈ బ్యూటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటోన్న ఆమె మరెవరో కాదు యుక్తి తరేజా. నాగ శౌర్య నటించిన రంగబలి మూవీతో తెలుగు సినిమాకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మార్కో సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయ్యింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాలోనూ కథానాయికగా అవకాశం దక్కించుకుంది. దీంతో పాటు ఓ కన్నడ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా ఛాన్స్ దొరికింది.
హరియాణాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది యుక్తి తరేజా. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2017లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఎమ్ టీవీ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది యుక్తి. ఎలాగైనా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలవాలనుకున్న ఈ ముద్దుగుమ్మ డిగ్రీ పరీక్షలు ఎగ్గొట్టి కాంపిటీషన్ లో పాల్గొంది. విజేతగా నిలవకపోయినా నాలుగో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి
యుక్తి తరేజా లేటెస్ట్ ఫొటోస్..
సినిమాల్లోకి రాక ముందు పలు టీవీషోస్, రియాలిటీ షోస్, మ్యూజిక్ వీడియోల్లో నటించింది యుక్తి తరేజా. ఆ తర్వాత రంగబలి తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మార్కో సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే గ్లామర్ ఫొటోస్, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.