Tollywood: తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‏గా ఎంట్రీ.. 10 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని తార..

2 hours ago 1

ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సత్తా చాటింది. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలతో చక్రం తిప్పింది. అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. దశాబ్దాలపాటు అనేక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈహీరోయిన్.. ఇటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ పలు సినిమాలు చేసింది. అటు సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాలతోనూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ జయప్రద.

14 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది. స్కూల్లో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఆమెను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివిగల పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు 2005 వరకు సాగింది. అంటే మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. జయప్రద తొలి సినిమాకు పది రూపాయాలు పారితోషికం తీసుకుంది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. కానీ తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది.

ఇవి కూడా చదవండి

చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుంది జయప్రద. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద.. 1986 జూన్ 22న సినీ నిర్మాత నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత బిజేపీలోకి మారారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article