సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి అకస్మాత్తుగ కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్ ఒకరు. బాలీవుడ్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కల్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది సనాఖాన్. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. అయితే తన సినిమా కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే సంచలన నిర్ణయం తీసుకుంది సనాఖాన్. 2020 సంవత్సరంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది సనా. పెళ్లి తర్వాత దుబాయ్ కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం సనా ఖాన్ ఇద్దరు పిల్లలకు తల్లి. కాగా సినిమా రంగంలో ఉన్నప్పుు సనా ప్రముఖ డ్యాన్సర్, స్టార్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో డేటింగ్ చేసింది. అయితే కొద్ది కాలానికే వీరిద్దరూ విడిపోయరు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన సనా ఖాన్ మెల్విన్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
, “మెల్విన్ చాలా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశాడు. అతను మైనర్ బాలికకు తరచూ డ్రగ్స్ ఇచ్చి గర్భవతిని కూడా చేశాడు. చాలా మంది అమ్మాయిల నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. అతని చేతిలో మోసపోయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక నన్ను కూడా చాలా సార్లు కొట్టాడు. పరుషమైన మాటలతో దుర్భాషలాడాడు. మెల్విన్ నిజ స్వరూపాన్ని గుర్తించడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది’ అని సనా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను మెల్విన్ ఖండించాడు.
ఇవి కూడా చదవండి
కుమారుడితో నటి సనాఖాన్..
సనా ఖాన్ చాలా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కేవలం 18 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఐదు భాషల్లో 18 సినిమాల్లో నటించింది. 50కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అంతేకాదు సనా ఖాన్ ‘బిగ్ బాస్’ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ క్రమంలోనే సనా, మెల్విన్ దాదాపు ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారు. అయితే ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి