తెలుగు హీరోయిన్ త్రిష ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన త్రిష.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు త్రిష నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్నిరోజులుగా త్రిష పేరు వార్తలలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే.
రెండు దశాబ్దాల సినీప్రయాణంలో సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది త్రిష. స్టార్ హీరోలతో ఆమె ప్రేమాయణం అంటూ ఎన్నోసార్లు రూమర్స్ వినిపించాయి. ఇక కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో ఆమె పేరు వినిపిస్తుంది. వీరిద్దరూ డేటింగ్ అని.. తర్వరలోనే త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడిచింది. సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లో చేరిపోతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఖండించారు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న త్రిష.. విజయ్ దళపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. షూటింగ్ సెట్ లో హీరో శింబు తనను టీజ్ చేస్తారని.. విజయ్ మాత్రం ఒక గోడ పక్కన చోటు వెతుక్కుని మౌనంగా కూర్చుంటారని తెలిపింది. విజయ్ దళపతిలో తనకు నచ్చని విషయం అదేనని.. ఆయన ఆ విషయాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు త్రిష. అలాగే విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు త్రిష చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన