TV9 Ismart News: ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి ఏడ్చింది

2 hours ago 1

ఎమ్మెల్యే క్యాండేటిచ్చిండు శిత్రమైన హామీ
పెండ్లిగాని ప్రసాదులందరికి లగ్గాలు చేపిస్తడట సామి

పట్టువడ్డ మందు బాబులకు గమ్మతి పనిష్మెంట్
వారంరోజులపాటు చెయ్యాల్నట దావ్కాన్ల క్లీనింగ్

జమ్ముకాశ్మీర్ అసెంబ్లీల లీడర్ల ఫైటింగ్
కిందవడి మీదవడి తన్నుకున్నరు తగ్గాఫర్

దొంగలు ఎత్కపోయ్న బండి మల్ల దొర్కింది
తప్పిపోయ్న పిలగాడు దొర్కినంత సంబురపడ్డది

యే అసెంబ్లీ చరిత్ర చూశ్న ఏమున్నది గర్వకారణం.. సమస్త మీటింగులన్ని పంతలు పల్గొట్టుకునే పైటింగులే అన్నట్టున్నది కొన్ని అసెంబ్లీల్ల అయితున్న సీన్లు సూస్తుంటే. ఎల్కేజీ పిలగాల్లు ఇస్రుకున్నట్టు కాయిదాలు కమ్మలు ఇస్రుకునుడు, ఒగలీ చేతిల కాయిదాలు ఇంకోగలు గుంజుకునుడు, స్పీకర్ పొడియం సుట్టు చేరి ఆగమాగం శందనం శందనం చేసుడు ఇసోంటి లలిత కళల ప్రదర్శనలు మస్తుగ చేస్తుంటరు గద గౌరవ ఎమ్మెల్యేలు. ఇప్పుడు జమ్ము కశ్మీర్ అసెంబ్లీల కూడ గదే సీన్ రీపీటైంది.

గెలిపిస్తె ఇండ్లు కట్టిస్తం.. ఉద్యోగాలిప్పిస్తం, ఊరికి రోడ్లేపిస్తం, ఉన్న రోడ్లు బాగచేస్తం.. కంపిన్లు వట్కస్తం, పించిన్లిప్పిస్తం.. రేషన్ కారెట్లు ఇప్పిస్తం.. అని గిసంటి హామీలిస్తరు లీడర్లెవ్వలైనా.. కని గా మహరాష్టల ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తున్న లీడర్ సాబ్ ఏమని హామీ ఇచ్చిండో తెల్సా? ఆయ్న నియోజకవర్గంల ఉన్న పెండ్లిగాని ప్రసాదులందరికి లగ్గం చేస్తా అని హామీ ఇస్తుండు.. సూడుర్రి కావాలంటె..

అద్దు తాగి బండ్లు నడ్పద్దని ఎల్కకు చెప్పినట్టు చెప్పినా.. తాగువోతోల్లైతే అస్సలే చెవ్విన పెడ్తలేరు…మందు తాగినంకనే మనం బండి మస్తు తోల్తం మామ అన్కుంట ఇంక ఎచ్చులకు తాగుతుర్రు.. ఎవ్వలి కస్టంతోటి ఆల్లింట్ల వాల్లు తాగి పంటే బైటోల్లకేం నస్టం లేదుగాని తాగి బండ్లు నడ్పి మంది గండాన యము దూతలెక్కనే మోపైతుర్రు గద కొంతమంది. అట్ల చెప్పంగ కూడ తాగి బండ్లు నడ్పుకుంట దొర్కినోల్లకు ఓకాడ కోర్టు ఎసోంటి పనిష్మెంటు ఇచ్చిందో సూస్తే మంచి పని , మందమర్రి అని సంబురపడ్తరు.

మనకు నచ్చినట్టు బత్కాలన్నా.. నచ్చింది తినాలన్నా.. నచ్చినట్టు తిర్గాలన్నా.. నచ్చినోల్లతోటి మాట్లాడాలన్నా.. నచ్చినోల్లతోటి కల్శి బత్కాలన్న నలుగురు ఏమనుకుంటరు.. సూశేటోల్ల ముంగట ఎట్లుంటది.. నలుగురిట్ల నవ్వుల పాలైతం.. అని భయపడి ఆశల్ సాలిచ్కోని కాంప్రమైజై బత్కుతుంటం.. కని గీ వీళ్లిద్దరట్ల నలుగురికో, సమాజానికో భయపడి బత్కే రకం కాదుల్లో.. వాళ్లకు నచ్చినట్టు బత్కి సూపెడ్తున్నరు.. సూడుర్రి ఎవలో..

కోటీశ్వరులకు ఆల్లు కొన్న బెంజు కారంటే ప్రాణమిడుస్తరు.. మద్యతర్గతోల్లు కొన్కున్న చిన్న స్కూటరైనా బెంజుకారు లెక్కనే సూస్కుంటరు.బండ్లు అనేటియి మనందర్కి ఒక ఏమోషన్.. రూపాయి రూపాయి దాపెట్టుకోని ఇస్టమైన బండ్లు కొన్కోని ముర్సిపోతుంటం.. పండుగలప్పుడు బండ్లను కడిగి తుడిశి బొట్లు వెట్టి పూజలుచేషి వాట్ని అల్లారు ముద్దుగా చూస్కుంటం. బండికి చిన్న గీత వడ్తనే ఓర్సుకోం…అంత పాయిరంగ సూస్కునే బండి పోతే ఆ బాదెట్లుంటది…

నిన్నియాల కొందరు యూత్ పిలగాళ్లు ఎట్లున్నరంటె.. ఆకార పుష్టి.. నైవేద్యం నష్టి అన్నట్టున్నరుల్లా.. సూపులకు ఆజానుభాహుల్లెక్కనే ఉంటరుగనీ.. ఆవగింజంత ధైర్యంగూడ ఉండది.. ఇగ సూడరాదుర్రి.. ఒక పెద్దమన్షిని పొడుస్తందుకు వొయ్న ఆవును గెదిమేతందుకు ఎంత భయపడ్డరో కొందరు..

అమెరికా ప్రెజిడెంటుగ మల్ల ఎన్నికైన ట్రంపు సారుకు వాళ్ల దేశంలన్న గుడికట్టి విగ్రహం పెట్టినోల్లు ఉన్నరో లేరోగనీ… మన జనగాం జిల్లాల ఒక వీరాభిమాని అప్పట్లనే గుడి కట్టి విగ్రహం నిలవెట్టి నిచ్చెపూజలు చేశిండు. అయితె ఎవలి కండ్లు మండినయో, ఎవలి జిట్టి తలిగిందో.. అటు ట్రంపు సారు ఓడిపోయిండు.. ఆ వీరాభిమానిగూడ పానం బాగలేక కాలంజేశిండు. మల్ల ఇప్పుడు, ఇన్నేండ్లకు ఎండిపోయ్న చెట్టు ఇగురువెట్టినట్టు, మూతవడ్డ ఆ గుడిని తెర్శి, బూజువట్టిన ట్రంపు బొమ్మకు పాలాభిషేకాలు చేస్తున్నరట అదే ఊల్లె ఉండే ట్రంపుసారు అభిమానులు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article