ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన వెంటనే వాస్తు పండితులను ఆశ్రయిస్తుంటారు. వారి సూచనలు, సలహాల మేరకు ఇంటిని నిర్మించుకుంటారు. వాస్తు దోషాలు ఉండడం వల్ల ఇంట్లో ఉండే వారి ఆర్థిక, ఆరోగ్యంపై ప్రభావాలు చూపుతాయని నిపుణులు చెబుతుంటారు.
అయితే భూమి విలువ బంగారంగా మారిన ప్రస్తుత రోజుల్లో అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ఉన్న కొంత స్థలంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇందులో భాగంగానే మెట్ల కింది ల్యాండ్‌ను వృధా కాకుండా అక్కడ బాత్‌రూమ్‌లను నిర్మిస్తున్నారు. అయితే వాస్తు ప్రకారం మెట్ల కింద బాత్‌రూమ్‌లు నిర్మించడం మంచిదేనా.? దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.? అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద టాయిలెట్ నిర్మించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. మెట్ల కింద టాయిల్ ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటయాని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వారికి నిత్యం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. మెట్ల కింద టాయిలెట్స్ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు.
అయితే ఆగ్నేయంలో నిర్మించిన మెట్ల కింత బాత్‌రూమ్‌ను నిర్మిస్తే ఆగ్నేయం మూతపడుతుంది. కంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఉన్న మెట్ల కింద బాత్‌రూమ్ లేదా మరుగుదొడ్డి నిర్మించడం మంచిది కాదని అంటున్నారు. ఆగ్నేయాన్ని కొంత వెనక్కు జరిపి కడుతుంటారు. ఇలాంటి ప్రదేశంలో కొన్ని అడుగుల భాగంలో బాత్‌రూమ్ నిర్మించుకుంటే ఎలాంటి దోషం ఉండదని అంటున్నారు. అయితే వీలైనంత వరకు మెట్ల కింద ఎలాంటి నిర్మాణాలు లేకపోవడమే మంచిది. ఇక ఒకవేళ బాత్‌రూమ్‌కు సంబంధించి ఏవైనా వాస్తు లోపాలు ఉంటే.. బాత్‌రూమ్‌లో కల్లుప్పును ఒక గాజు గ్లాసులో వేసి ఒక మూలన ఉంచాలి. ఇలా వారం రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. దీనివల్ల నెగిటిజ్ ఎనర్జీ దూరమయ్యే అవకాశం ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్తీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..