Legend League Guptill Record Innings: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో 38 ఏళ్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ బ్యాట్స్‌మన్ కేవలం 49 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో అజేయంగా 160 పరుగులు చేశాడు. బౌలర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, ఈ బ్యాట్స్‌మన్ తుఫాన్ ఇన్నింగ్స్‌ను శాంతింపజేయలేకపోయారు. ఇక మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రత్యర్థి జట్టు కలిసి ఈ బ్యాట్స్‌మెన్ చేసినంత స్కోర్ కూడా చేయలేకపోయారు. నిజానికి, లెజెండ్ 90 లీగ్ 8వ మ్యాచ్ ఛత్తీస్‌గఢ్ వారియర్స్ వర్సెస్ బిగ్ బాయ్స్ యునికారి మధ్య జరిగింది. అదే మ్యాచ్‌లో, ఒక బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ద్వారా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.
‘భీకరమైన ఫామ్’తో బీభత్సం..
నిజానికి, ఈ పరుగుల బాణసంచా లెజెండ్ 90 లీగ్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ బ్యాట్ నుంచి కనిపించింది. గుప్టిల్ బౌలర్లను ఏమాత్రం కనికరం లేకుండా చిత్తు చేశాడు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ తరపున ఆడుతున్న మార్టిన్ గుప్టిల్ కేవలం 49 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు ఈ ఇన్నింగ్స్‌కు సమానమైన స్కోరు కూడా చేయలేకపోయింది. ప్రత్యర్థి జట్టు 15 ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి 89 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో, గుప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇలాంటి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన రోజులను ఫ్యాన్స్ గుర్తు చేశాడు.
ఇవి కూడా చదవండి
బౌలర్లు బలి..
వారియర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత న్యూజిలాండ్ మాజీ లెజెండ్ స్టేడియంలో సంచలనం సృష్టించాడు. ఆరంభం బాగాలేదు. కానీ, ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ కేవలం 21 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు. ఇక 12వ ఓవర్‌లో బీభత్సం చేశాడు. ఇషాన్ మల్హోత్రా ఓవర్‌లో 29 పరుగులు చేసి కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీనితో, అతను లెజెండ్ 90 లీగ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. అతని తదుపరి అర్ధ సెంచరీ కేవలం 13 బంతుల్లోనే వచ్చింది. అతను చేసిన 160 నాటౌట్ ఇన్నింగ్స్ ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.
240 పరుగుల భారీ స్కోర్..
Absolute carnage successful Raipur! 🤯
Martin Guptill goes perfectly berserk, smashing 160 runs disconnected conscionable 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4
— FanCode (@FanCode) February 10, 2025
గుప్టిల్ 326.53 అసాధారణ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతనికి రిషి ధావన్ మద్దతు ఇచ్చాడు. అతను 42 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి 240 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టోర్నమెంట్‌లో అత్యధికంగా నిలిచింది. దీంతో, వారియర్స్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 240 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇదే తొలి 200+ స్కోరు కావడం గమనార్హం.
89 పరుగుల తేడాతో విజయం..
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బిగ్ బాయ్స్ యునికార్న్ కఠినమైన సవాలును ఎదుర్కొంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ స్కోరు బోర్డు ఒత్తిడిలో విఫలమయ్యారు. జతిన్ సక్సేనా వికెట్ కోల్పోవడంతో వారికి చాలా పేలవమైన ఆరంభం లభించింది. ఆ తర్వాత వెంటనే, కెప్టెన్ ఇషాన్ మల్హోత్రా కూడా అభిమన్యు మిథున్ బంతికి ఔటయ్యాడు. సౌరభ్ తివారీ (37), రాబిన్ బిష్ట్ (55 నాటౌట్) ప్రయత్నించినా, జట్టు 151/4 మాత్రమే చేరుకోగలిగింది. 89 పరుగుల తేడాతో ఈ అద్భుతమైన విజయంతో, ఛత్తీస్‌గఢ్ వారియర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించి పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..