తమిళ నటుడు విజయ్ సేతుపతి , వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల 1 సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతితో పాటు సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకసారి రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ల అద్భుతమైన నటన, వెట్రి మారన్ టేకింగ్ ఆడియెన్స్ ను ఫిదా చేశాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విడుదల పార్ట్ 2 సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి19) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగు భాషలోనూ విడుదల పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. కాగా విడుదల పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జీ 5 ఓటీటీలోనూ విడుదల పార్ట్ 2 సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరో పది రోజులకు జీ 5లో కూడా విజయ్ సేతుపతి స్ట్రీమింగ్ కానుంది. ఆర్ ఎస్ ఇన్ఫోటైన్ మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై కుమార్, వెట్రి మారన్ విడుదల పార్ట్ 2 సినిమాను నిర్మించారు. ఇళయ రాజా స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో విడుదల పార్ట్ 2 ను మిస్ అయ్యారా? విజయ్ సేతుపతి సినిమాలంటే మీకు ఇష్టమా? అయితే వీ వీకెండ్ లో విడుదల పార్ట్ 2 ఓ మంచి ఛాయిస్.
ఇవి కూడా చదవండి
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
hero oregon a villain? Listen to Vaathiyar talk his-story🤌🔥#ViduthalaiOnPrime, Watch Now:https://t.co/Oolb5y5LfOhttps://t.co/nfSUqHSZZg@VijaySethuOffl @sooriofficial @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72 @menongautham @DirRajivMenon @Chetan_k_a @KenKarunaas #VetriMaaran pic.twitter.com/ilV4pAG6sv
— premier video IN (@PrimeVideoIN) January 18, 2025
తెలుగులోనూ చూడొచ్చు..
imagine these legends successful a movie 👀 pic.twitter.com/6EXIz09T3l
— premier video IN (@PrimeVideoIN) January 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి