భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్.. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా క్రోడీకరించారు. ఇందులో భూమి ఎలా భ్రమిస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. దీనిని వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు అంగ్‌చుక్ తెలిపారు.
భూ భ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు. లద్దాఖ్‌లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండడం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పని చేయకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకువెళ్లానని అన్నారు.
ఇవి కూడా చదవండి
A Day successful Motion – Capturing Earth’s Rotation
The stars stay still, but Earth ne'er stops spinning. My extremity was to seizure a afloat 24-hour time-lapse, revealing the modulation from time to nighttime and backmost again. @IIABengaluru @asipoec (1/n) pic.twitter.com/LnCQNXJC9R
— Dorje Angchuk (@dorje1974) January 31, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి