సాధారణంగా ఏదన్నా ప్రయాణం ఉందంటే మహిళలకు తలనొప్పిగా మారుతుంది. బట్టల సర్దడం అనేది తేలికగా ఉన్నా.. సరిగ్గా సర్దకపోతే లగేజీ పెరిగిపోతుంది. అంత లగేజీతో బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి అవసరాలకు సరిపడగా లగేజీ సర్దుకోవాలి. మీరు ఎక్కడికైనా ప్రయత్నిస్తున్నప్పుడు బ్యాగ్‌ని ఇలా సర్దారంటే ఎక్కువ బట్టలు పడతాయి. ఈ ప్యాకింగ్ టిప్స్ మీ కోసమే. ట్రావెల్ లగేజీకి సంబంధించి ఓ మహిళ బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పట్టేలా ఎలా అరేంజ్ చేసిందో చూడండి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఇంకెందుకు లేట్ మీరు ఓ లుక్ వేసేయండి. ఈ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగ పడతాయి.
ఏ చిన్న ప్రయాణం ఉన్నా.. పిల్లలు ఉన్నారంటే వాళ్ల లగేజీనే ఎక్కువగా ఉంటుంది. అందరివి ఒక బ్యాగ్‌లో పట్టాలంటే కష్టం. ఎలా లేదన్నా రెండు, మూడు బ్యాగ్‌లు అవుతాయి. ఈ మహిళ చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే.. తక్కువ బ్యాగులే సరిపోతాయి. మరి అదేలెగా చూడండి.
ఈ వీడియోలో మహిళ ముందుగా తనకు కావాల్సినవి అన్నీ తీసుకుంది. ముందుగా పౌడర్, స్ప్రే వంటివి లీక్ కాకుండా బెలూన్ వేసింది. ఆ తర్వాత సూట్ కేస్‌ని అడ్డంగా కుండా నిలువుగా పెట్టి ప్యాకింగ్ చేస్తుంది. అలా ఎక్కువ బట్టలను సర్దేస్తుంది. ఆ నెక్ట్స్.. దుస్తుల నుంచి ఎలాంటి వాసన రాకుండా ఫ్రెష్‌నర్ షీట్‌లను కూడా పెడుతుంది. బేబీ డైపర్‌ని ఉపయోగించి దాన్ని పర్స్‌గా ఉపయోగిస్తుంది. అందులో పాస్‌పోర్ట్, గోల్డ్ చైన్, రింగ్ వంటివి ముఖ్యమైన వాటిని పెట్టి కవర్ చేస్తుంది. ఆ నెక్ట్స్ తన ఇయర్ రింగ్స్ పెడుతుంది. అలాగే స్కిప్పింగ్ చేసే రోప్ కూడా పెడుతుంది. చొప్పులు, పిల్లల బట్టలు ఎలా సర్దాలో అంతా చూపిస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి.