హర్యానాలోని గురుగ్రామ్ టోల్ ప్లాజాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. టోల్ రుసుము చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నంలో టోల్ బూత్‌ను ఢీకొట్టాడు. అంతేకాకుండా వేగంగా వెళుతూ టోల్ గేట్ ఉద్యోగులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ టోల్ గేట్ సిబ్బందిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. గురుగ్రామ్-సోహ్నా రోడ్డులోని ఘమ్రోజ్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
టోల్‌ప్లాజా వద్ద ఓ కారు ఆగి ఉన్న దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి. కారు నడిపే వారితో టోల్ ప్లాజా ఉద్యోగి వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ టోల్ బూత్‌ను ఆపకుండా దాటవేస్తూ వేగంగా దూసుకువచ్చాడు. డ్రైవర్ తన తొందరపాటుతో బూత్ పక్కన నిలబడి ఉన్న టోల్ ఉద్యోగులను ఢీకొట్టాడు. ఈ హఠాత్తు పరిణామంతో టోల్ గేట్ సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన టోల్ వర్కర్‌ను కాన్పూర్‌కు చెందిన 34 ఏళ్ల దిలీప్ సింగ్‌గా గుర్తించారు. టోల్ ప్లాజా మేనేజర్ మనోజ్ బైస్లా ఫిర్యాదు మేరకు భోండ్సీ పోలీసులు కేసు నమోదు చేశారు. గురుగ్రామ్ నుండి సోహ్నా వైపు వెళ్లే రోడ్‌వేస్ బస్సు అత్యంత వేగంతో టోల్ ప్లాజా వద్దకు చేరుకుందని చెబుతున్నారు. డ్యూటీలో ఉన్న దిలీప్ సింగ్‌ను బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఢీకొట్టడంతో అతడి రెండు కాళ్లు బస్సు చక్రాల కిందకు వెళ్లాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ బస్సుతో పాటు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన టోల్‌ప్లాజాలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. టోల్ కార్మికుడిని బస్సు ఎలా ఢీకొట్టింది అనేది ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. గాయపడిన దిలీప్‌ను వెంటనే సోహ్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి చికిత్స కొనసాగుతోంది. గాయపడిన టోల్ వర్కర్ వాంగ్మూలం ఆధారంగా రోడ్డు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చంద్రభాన్ తెలిపారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
गुरुग्राम में टोल बचाने के लिए हरियाणा रोडवेज ने टोलकर्मी के मारी टक्कर, गुरूग्राम के सोहना रोड स्थित घामडोज टोल की है घटना, सीसीटीवी में कैद हुई विडियो.. #haryananews #gurugram #viralpost #viralvideo pic.twitter.com/TgY8ULYHBm
— JITENDER MONGA (@JITENDERMONGA_) February 2, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..