ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలలో కుంభమేళ వైభవాన్ని చూడొచ్చు. కొన్ని వీడియోలు మహాకుంభ మేళకు వస్తున్న, వచ్చిన వ్యక్తులకు సంబంధించిన విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు అన్ని అఖారాలకు చెందిన సాధువులు, సన్యాసులు కూడా వచ్చారు. ఇదిలా ఉంటే కుంభమేళలో 144 ఏళ్ల సాధువు మరణించాడని పేర్కొంటూ ఒక వీడియో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
డియోలో ఓ సన్యాసి బ్రహ్మలీనంగా మారడం కనిపిస్తోంది. అతని మృతదేహానికి తుది ప్రక్రియలు జరుగుతున్నాయి. వెనుక ఒక పోస్టర్ కనిపిస్తుంది. అందులో జునా అఖారా అని వ్రాయబడింది. వీడియోను షేర్ చేస్తూ.. సాధువు వయస్సు 144 సంవత్సరాలు అని, అతను మహాకుంభమేళాలో తుది శ్వాస విడిచాడని పేర్కొన్నారు. ఇలాంటి మహా కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుందని, 144 సంవత్సరాల తర్వాత గురూజీ తన జీవితాన్ని త్యాగం చేశాడని అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
A 144 twelvemonth aged Saint took his past enactment astatine Mahakumbh successful Prayagraj 🙏
He took samadhi astatine the property of 144. pic.twitter.com/n5lwdbVTpJ
— Sunanda Roy 👑 (@SaffronSunanda) February 1, 2025
ఈ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. ఒక సోషల్ మీడియా యూజర్ బాబా జీ అదృష్ట వంతుడని, అలాంటి అదృష్టం ఎవరికి వస్తుందని రాశారు.? మరొకరు 144 సంవత్సరాలు అసాధ్యం అని రాశారు. ఆయన చివరి క్షణాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండాల్సింది అంటూ మరొకరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..