వాట్సాప్ యాజమాన్యం కూడా లేటెస్ట్ ఫీచర్లను ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. వారికి అవసరమైన అన్ని మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా కస్టమ్ లిస్ట్ అనే ఫీచర్ ను పరిచయం చేసింది. కేటగిరీలా వారీగా చాట్ లను నిర్వహించడానికి యూజర్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది. వాట్సాప్ కస్టమ్ చాట్ లిస్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ చాట్ లిస్టును సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్నేహితులు, బంధువుల, కుటుంబ సభ్యులతో సులభంగా కనెక్ట్ అయ్యేందుకు చాలా ఉపయోగ పడుతుంది. యూజర్లు తమ చాట్ ను తమకు నచ్చిన గ్రూపులో డివైడ్ చేసుకోవచ్చు. అవసరమైన వారి కాంట్రాక్టులను లిస్టుగా తయారు చేసుకోవచ్చు.
వాట్సాప్ లో లిస్టుల ను సెట్ చేసుకోవడం చాలా సులభం. చాట్స్ ట్యాప్ ఎగువన ఫిల్టర్ బార్ లోని ప్లస్ అనే ఐకాన్ ను ట్యాప్ చేయడం ద్వారా వినియోగదారులు తమ జాబితాను తయారు చేసుకోవచ్చు. కొత్త కాంట్రాక్టులను యాడ్ చేయడం, జాబితా పేరు మార్చడం, ఎడిట్ చేయడం చాలా ఈజీగా జరుగుతుంది. దీనితో పాటు ఒకరితో ఒకరు చాట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. లిస్టులో అన్ని కేటగిరీలకు చెందిన చాట్ లు ఫిల్టర్ బార్ లో కనిపిస్తాయి. దీంతో వాట్సాప్ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయగానే మనకు వివిధ కాంటాక్ట్ నంబర్లు కనిపిస్తాయి. వాటిలో మన స్నేహితులు, బంధువులు, కోలిగ్స్, కుటుంబ సభ్యుల నంబర్లు కలిసే ఉంటాయి. వాటితో మనకు కావాల్సిన వ్యక్తితో చాటింగ్ చేయడానికి ముందుగా నంబర్ ను వెతుక్కోవాలి. లేదా సెర్చ్ బార్ ను ఉపయోగించి తెలుసుకోవాలి. వాట్సాప్ తీసుకువచ్చిన కస్టమ్ చాట్ లిస్టు ఫీచర్ తో ఇలా వెతుక్కోవాల్సిన పని ఉండదు.
వాట్సాప్ కొత్త ఫీచర్ ను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం యాప్ తెరవడానికి ఆల్, అన్ రీడ్, ఫేవరెట్స్, గ్రూప్స్ అనే పేర్లతో ఫిల్టర్లు కనిపిస్తాయి. వాటిలో చివరగా ప్లస్ అనే గుర్తు ఉంటుంది. దాన్ని ఉపయోగించి మన కాంటాక్టులతో ఫ్యామిలీ, ఆఫీసు, ఫ్రెండ్స్ ఇలా నచ్చిన గ్రూపును క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్ ని లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. కొత్త ఫీచర్ ఇప్పటికే అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మోటా సీఈవో మార్క్ జుకర్ బర్క్ తన వాట్సాప్ చానల్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా తీసి అప్ లోడ్ చేశారు. రోల్ అవుట్ అవుతున్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి