WTC Final: బంగ్లాపై క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా దూకుడు.. టీమిండియాకు చేరువలో..

2 hours ago 1

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో టాస్ గెలిచిన ఐడెన్ మార్క్రామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 575 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ను చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మారింది. మూడో రోజు రెండో సెషన్‌లో బంగ్లాదేశ్ జట్టు మొత్తం కేవలం 159 పరుగులకే ఆలౌటైంది. కాబట్టి దక్షిణాఫ్రికా పెద్ద ఆధిక్యంతో ఫాలో ఆన్ ఇచ్చింది. ఫాలో-ఆన్ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో బంగ్లాదేశ్ మళ్లీ విఫలమైంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది .

దక్షిణాఫ్రికా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టిన ఆటగాడు కగిసో రబడ. డేన్ పీటర్సన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సెనూరన్ ముత్తుసామి ఒక వికెట్ సాధించాడు. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ వెన్ను విరిచాడు. సెనూరన్ ముత్తుసామి 4 వికెట్లు తీశాడు. డేన్ పీటర్సన్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ స్పందించాడు. “ఇంకా చాలా టెస్టు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ సీజన్‌లో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోవాలని భావిస్తున్నాం’ అని ఐడెన్ మార్క్రామ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్ల పట్టిక మారిపోయింది. దక్షిణాఫ్రికా గెలుపు శాతం బాగా పెరిగింది. న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి ఎగబాకింది. రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. శ్రీలంక, పాకిస్థాన్‌లు రెండు టీమ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆసక్తికరంగా ఈ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గెలుపు శాతం 54.17 శాతం. భారత్ విజయాల శాతం 62.82, ఆస్ట్రేలియా 62.50, శ్రీలంక 55.56, న్యూజిలాండ్ విజయ శాతం 50 శాతంగా ఉన్నాయి.

WTC పాయింట్ల పట్టిక..

World Test Championship #WTC points table SA person registered dominating triumph implicit BAN, with this 2-0 triumph SA are present beforehand runners to get to the final. They person 4 Test astatine location and 3 wins volition springiness them a precise bully accidental of final#BANvSA pic.twitter.com/4J1X5J8fPz

— Cricket baba (@Cricketbaba5) October 31, 2024

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article