లావణ్య ! అప్పట్లో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ... పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈమె.. ఇప్పుడు మరో సారి బయటికి వచ్చింది. మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈసారి లావణ్య బిగ్‌బాస్ ఫేమ్ ఆర్‌జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్ బాషా యత్నించారని లావణ్య ఆరోపించింది.
అంతే కాదు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా ఆడియోలను కూడా పోలీసులకు అందజేసింది లావణ్య. ఇక హీరో రాజ్‌తరుణ్ -లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత దుమారం రేపిందో..అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకుమించిన దుమారం ఈమస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లు రేపుతున్నాయి. అతని బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంపై గతంలో పదేపదే ఆరోపించినా సరైన ఆధారాలు లావణ్య దగ్గర లేవు. ఆ ఆధారాల సేకరణకోసమే మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది లావణ్య. తనకు సంబంధించి ఆధారాల కోసం వెతుకుతుంటే.. అదే హార్డ్ డిస్క్‌లో మైండ్ బ్లాంక్ అయ్యేలా వీడియోలు బయటపడ్డాయి అంటూ చెబుతోంది. మరి చూడాలి ఈ సారి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళుతుందో..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: ఎట్టకేలకు OTTలోకి గేమ్ ఛేంజర్..
రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు
అవును.. అలా పెట్టడం నా తప్పేనండీ.. క్షమించండి..
సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ