తెలుగులో సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. సినిమా హీరోయిన్స్ ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్స్ మాములుగా ఒకొక్క సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తన క్రేజ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీరియల్ యాక్టర్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ నటి హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఒక్క ఎపిసోడ్‌కు రూ.65 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ చిన్నది. అంతే కాదు తన అందంతోనూ ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాలు, సీరియల్స్ , సిరీస్ లతో పాటు ఇతర బాషల సీరియల్స్, సిరీస్ లు కూడా మన దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. అలాగే కొరియన్ సిరీస్ లకు కూడా మన దగ్గర మంచి క్రేజ్ ఉంది. చాలా మంది కొరియన్ సిరీస్ కు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. వీటిలో నటించిన కొందరు ఆర్టిస్టులు చాలా పాపులర్ అయ్యారు. అలాగే ఓ కొరియన్ స్టార్ కూడా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.
జున్ జి-హ్యూన్. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. 43 ఏళ్ల వయసులోనూ ఈ చిన్నది తన అందంతో కవ్విస్తుంది. మై సాసీ గర్ల్ అనే రొమాంటిక్ కామెడీ సిరీస్ తో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిన్నది మై లవ్ ఫ్రమ్ ది స్టార్, ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ, అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కింగ్‌డమ్, అనేక కొరియర్ డ్రామాలలో నటించింది. ఈ అమ్మడు ఒకొక్క ఎపిసోడ్ కు దాదాపు 99,900 USD అందుకుంటుంది. మన దగ్గర దాదాపు రూ. 65లక్షలు. ఇక ఈ చిన్నదానికి మన దగ్గర కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి