మాస్ మాహారాజా రవితేజకు ఇప్పుడు సాలిడ్ సక్సెస్ అవసరం. చిన్న హీరోలు, స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే రవితేజ సక్సెస్ కోసం సతమతం అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మెగాస్టార్ ఖాతలోకి వెళ్ళిపోయింది. అసలు రవితేజ సినిమాలకు ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతరే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో భాగ్య శ్రీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు రవితేజ.
ప్రస్తుతం తన కెరీర్ లో 75వ ప్రాజెక్టు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. రవితేజకు లవర్‌గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అవును ఓ హీరోయిన్ మాస్ రాజ్‌కు లవర్‌గా, భార్యగా, వదినగా నటించింది.
ఆ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ శ్రుతి హాసన్. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. ఇందులో రవితేజ లవర్ గా కనిపించింది శ్రుతిహాసన్. ఆ తర్వాత వీరిద్దరు కలిసి క్రాక్ సినిమాతో మరోసారి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇందులో రవితేజ భార్యగా కనిపించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా నటించారు రవితేజ. ఇందులో చిరు సరసన కథానాయికగా మెరిసింది శ్రుతిహాసన్. అలా ఈ సినిమాలో రవితేజకు శ్రుతి హాసన్ వదినగా నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి