భారతదేశంలో దేవతా విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొన్ని విగ్రహాలు దేవతా స్వయంభువులుగా వెలసినవి అయితే, కొన్ని మాత్రం శిల్పులు తమ కళానైపుణ్యంతో తీర్చిదిద్దినవి. ఇలాంటివెన్నింటినో ఆలయాల్లో ప్రతిష్ఠించి.. పూజలు చేస్తున్నారు. ఇక.. కొందరు రాయిపై శిల్పాలు చెక్కితే.. మరికొందరు పంచలోహాలతో దేవతా విగ్రహాలను తయారుచేస్తారు. అలాంటివాటిలో అత్యంత అరుదైన... ప్రపంచంలో మరెక్కడా కనిపించని దేవతామూర్తి విగ్రహం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో పూజలందుకుంటోంది. ఇంతకీ ఆ దేవతా మూర్తి ఎవరు.. ఆ కథేమిటో తెలుసుకుందాం.పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ.. వైశ్యులు తమ కులదేవతగా ఆరాధించే కన్యకాపరమేశ్వరిదేవి జన్మస్థలం.
పెనుగొండ పాలకులైన కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు వాసవి మాత జన్మించారు. రూపవతి, గుణవతి అయిన ఈ కన్యకను రాజమహేంద్రవరాన్ని పాలిస్తున్న విష్ణువర్ధనుడు అనే రాజు వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయమై కన్యక తల్లిదండ్రులను సంప్రదిస్తాడు. అయితే ఈ వివాహానికి కన్యక అంగీకరించదు. అంతేకాదు, ఈ పెళ్లికి కన్యకతోపాటు మరో 102 మంది గోత్రికులు నిరాకరిస్తారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన విష్ణువర్థనుడు యుద్ధం చేసి వాసవిని గెలుచుకొని వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ గ్రామంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వాసవిమాత యుద్ధంలో అనేకమంది మరణిస్తారని, తనకారణంగా హింస జరగకూడదని కోరుకుంది.
Published on: Feb 11, 2025 06:01 PM