గతేడాది వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా లాన్సెట్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం..ఇండియాలోని పట్టణాల్లో నివసించే వాళ్లలో దాదాపు 70% మంది ఓవర్‌వెయిట్‌తో బాధ పడుతున్నారు. అత్యధికంగా ఒబెసిటీ బాధితులున్న దేశాల్లో అమెరికా, చైనా తరవాత స్థానం భారత్‌దే. దాదాపు 8 కోట్ల మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నంబరే టెన్షన్ పెడుతోంది అనుకుంటే..ఏజ్‌గ్రూప్‌కి సంబంధించిన వివరాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. 5 నుంచి 19 ఏళ్ల లోపు వాళ్లే ఈ ఒబెసిటీ బాధితులుగా ఉంటున్నారు. ఇండియాలో ఆరు కోట్ల మందిలో ఒబెసిటీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీగా పొట్ట రావడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం లాంటి సింప్టమ్స్ ఉంటున్నాయి. వీళ్లంతా ఒబెసిటీకి దగ్గర్లో ఉన్న వాళ్లే. ఉన్నట్టుండి ఇప్పుడు ఒబెసిటీ గురించి మాట్లాడడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో ఒబెసిటీ గురించి ప్రస్తావించారు. దేశంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్ వస్తోందని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఫిట్ ఇండియా ఉద్యమం గురించీ మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జలకన్య వేషంలో యువతి.. దాడి చేసిన భారీ చేప
ఒంట్లో ఐరన్ తగ్గిందా.. అయితే ఇలా చేయండి
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!