అగ్నిగుండాల ప్రవేశం ద్వారా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం..! చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశంతో కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఎర్రగా దగడగలాడే నిప్పుల్లో నడిచిన భక్తులు వారి భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదే నిప్పుల్లో నడిచి భక్తిని చాటుకున్నారు.
Veerabhadra Swamy Temple
అగ్ని గుండాల ప్రవేశంతో కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిఘట్టం అగ్నిగుండాల ప్రవేశం కార్యక్రమం మహా వైభవంగా జరిగింది. వీరభద్ర శరభ శరభ అని స్మరిస్తూ.. ఎర్రగా దగడగలాడే నిప్పుల్లో నడిచిన భక్తులు వారి భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదే నిప్పుల్లో నడిచి భక్తిని చాటుకున్నారు.
హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం కొత్తకొండ లోని వీరభద్రస్వామి ఆలయంలో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. జాతర సమయంలో వేలాదిమంది తరలి వచ్చి వీరభద్రస్వామి గుమ్మడి కాయ మొక్కలు చెల్లిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశం. శనివారం(జనవరి 18) తెల్లారుజామున అగ్నిగుండాల ప్రవేశం నిర్వహించారు. ఎర్రటి నిప్పుల్లో నడిచిన భక్త జనం వీరభద్ర శరభ శరభ అని స్తుతిస్తూ వారి భక్తి పారవశ్యాన్ని చాటారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా వారి భక్తిని చాటారు.. ఎర్రటి నిప్పుల్లో నడిచి వీరభద్రస్వామి పై వారికి ఉన్న భక్తి విశ్వాసాన్ని చాటారు..
అగ్నిగుండాల ప్రవేశం ద్వారా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం..! చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆలయ పూజారులు తెలిపారు.
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..