ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ బిజినెస్ లోన్ కొత్త బ్రాండ్ ఫిల్మ్ రిలీజ్ చేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారులకు ఆర్థిక సాయం అందించే థీమ్ తో దీన్ని రూపొందించింది. వారిలో ఒక ఆశ నింపేందుకు, వారి జీవితాలను సమూలంగా మార్చేందుకు, వారి ముందున్న అనంతమైన అవకాశాలను తెలియజేస్తూ ఈ బ్రాండ్ ఫిల్మ్ రూపొందింది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం ఎస్ఎంఎఫ్ జీ ఎంత కమిట్ మెంట్ తో ఉందో ఈ ఫిల్మ్ తెలియజెప్తుంది. వారు మరింత పెద్ద కలలు కనేందుకు, మరింత ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ బిజినెస్ లోన్ ఎలా సహకరిస్తుందో కళ్లకు కట్టినట్టు ఉంది.
వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కష్టాలు పడుతున్న ఓ చిన్న రిటైలర్ జీవితంలో జరిగే సంఘటనలకు హాస్యాన్ని జోడించి, మ్యూజికల్ టచ్ ఇచ్చి మరింత హృద్యంగా ఈ ఫిల్మ్ చిత్రీకరించారు. ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ బిజినెస్ లోన్ అనేది ఆ చిరు వ్యాపారి జీవితాన్ని ఎలా మలుపుతిప్పింది? ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది?, అతనికి కొత్త గుర్తింపును ఎలా తీసుకొచ్చింది? ఆతని ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడిందనే అంశాలను హృద్యంగా చిత్రీకరించారు. ఒక వ్యక్తి ఆశయం, అతని ఆర్థిక స్వావలంబన ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ ఫిల్మ్‌లో అంతర్లీనంగా ఉంటుంది.
ఈ ఫిల్మ్ గురించి ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అజయ్ పరీక్ మాట్లాడుతూ ‘భారతదేశ జీడీపీలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా 30% ఉంది. ఉద్యోగాల కల్పనలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కానీ, వారికి రుణాలు కావాల్సినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి సరళమైన రేటుకే వడ్డీకి, తక్కువ డాక్యుమెంట్లు, సులభమైన చెల్లిపు పద్ధతుల్లో ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ రుణాలు ఎలా కల్పిస్తుందో ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలియజేస్తుంది. టార్గెట్ ఆడియన్స్ ను చేరుకోవడానికి సరిపోయే భిన్నమైన కథనం, మ్యూజికల్ టచ్, సరదాగా ఉండే సన్నివేశాలు అన్నీ ఈ ఫిల్మ్ లో ఉన్నాయి.’ అని అన్నారు.
ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ అందుబాటులో ఉండే, సులభమైన వ్యాపార రుణాలు అందించేందుకు కట్టుబడి ఉంది. వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందించడం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్ధికి సహకారం అందిస్తుంది. ప్రత్యేకించి బిజినెస్ లోన్స్ విభాగంలో ఉంది. వ్యాపారాన్ని మరింత విస్త్రతం చేయాలనుకునే వారికి, మరింత సమూలంగా మార్చాలనుకునే వారికి, తద్వారా వృద్ధి చెందాలనుకునే వారికి ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటుంది.
ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్..
ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ (ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్) అనేది లీడింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ – ఇన్వెస్టిమెంట్, క్రెడిట్ కంపెనీ (ఎన్బీఎఫ్ సీ -ఐసీసీ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ అయి ఉంది. ఎస్ఎంఎఫ్ జీ లో ఇది సబ్సిడరీ. 2007 నుంచి సేవలు అందిస్తోంది. మరో సబ్సిడీ అయిన ఎస్ఎంఎఫ్ జీ ఇండియా హోమ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో కలసి పనిచేస్తుంది. భారతదేశం నలుమూలల విస్తరించి ఉంది. 1000కు పైగా బ్రాంచులు, 25,000కు పైగా ఉద్యోగులతో 670కు పైగా పట్టణాల్లో, 70,000కు పైగా గ్రామాల్లో ఎంతో మంది చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రుణ సేవలు అందిస్తోంది. ఎస్ఎంఎఫ్ జీ ఇండియా క్రెడిట్, ఎస్ఎంఎఫ్ జీ గృహశక్తి సంయుక్తంగా సమగ్రమైన రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారులకే కాకుండా, కమర్షియల్ వాహనాలు, ద్విచక్రవాహనాల రుణాలు, గృహ రుణాలు, హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్లు, ప్రాపర్టీ మీద రుణాలు, షేర్ల మీద రుణాలు, పర్సనల్ లోన్లు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత పెంచడానికి అవసరమైన రుణాలు అందిస్తుంది.