ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంతా ఈ డాలర్ విలువతోనే ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పైగా..ప్రస్తుతానికి డాలర్ విలువ చాలా బలంగా ఉంది. కానీ..ఉన్నట్టుండి ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టే సరికి స్టాక్ మార్కెట్‌లో అలజడి మొదలైంది. కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్‌లు విధించారు ట్రంప్. ఈ దెబ్బకి ఒక్కసారిగా ఇండియా మార్కెట్‌లో సీన్ మారిపోయింది. ఆ దేశాల మాదిరిగానే…ట్రంప్..ఇండియాపైనా టారిఫ్‌లు విధించే అవకాశముండొచ్చు అన్న భయం కనిపించింది. ఫలితంగా దలాల్ స్ట్రీట్ డల్ అయిపోయింది. కెనడా దిగుమతులపై అమెరికాలో దాదాపు 25% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు ట్రంప్. చైనా ఉత్పత్తులపై 10% టారిఫ్‌లు ఉంటాయని అన్నారు. ఈ స్టేట్‌మెంట్స్ ఇచ్చాక ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. ఇదే మొదలైతే..క్రమంగా ద్రవ్యోల్బణానికి దారి తీసే ప్రమాదముంది. నిజానికి ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయంగా ఓ రకమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ ప్రభావం.. భారతీయులపై గట్టిగానే పడనుంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్. పెళ్లి అంటే ముందుగా ఎవరైనా ఆలోచించేది బంగారం గురించే. వివాహం అంటే బంగారం ఉండి తీరాల్సిందే. ఈ సమయంలోనే గోల్డ్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ రావడం పెద్ద సమస్యే తెచ్చి పెట్టింది. ఆయన రావడం ఏమో కానీ..అప్పటి నుంచి బంగారం ధర పైపైకి పోతూనే ఉంది. ప్రస్తుతానికి డాలర్ విలువ 87 రూపాయలకు పైగానే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం
Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?
ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..
స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు