నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవకపోవడం.. వంటి ప్రత్యుత్పత్తి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అయితే మన శరీరంలో ఐరన్ లోపాన్ని మనం తీసుకునే ఆహారం ద్వారానే అధిగమించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని ఆహారాలను నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి..పాలకూర, తోటకూర లాంటివి గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని ఇతర ఆకుపచ్చ కూరగాయల్లోనూ ఐరన్ ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం. ఐరన్‌ను పెంచే ఆహారాలలో ఆకు కూరలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. వీటితోపాటు నిమ్మకాయను కూడా ఆహారంలో భాగంగా తినడం వల్ల ఐరన్ లోపాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే టొమాటోలో లైకోపీన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయలలో ఉండే పోషకాల మాదిరిగానే ఐరన్‌ను పెంచుతుంది. ఐరన్‌లోపంతో బాధపడేవారు ఆహారంలో పెరుగు కూడా చేర్చుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అల్లం, వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ.. ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్..!
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్.. పోస్టర్ అదిరిందిగా..!
లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్ సాయి అరెస్ట్
అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం