కడుపులోని పురుగులను వదిలించుకోవడానికి అగ్రరాజ్యం అమెరికాలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. సోషల్ మీడియా ప్రకారం.. కడుపులో పురుగులను చంపడానికి బొప్పాయి గింజలు తినమని అక్కడి ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ మేరకు కొంతమంది వీడియోలు చేసి తమ అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. కానీ, బొప్పాయి గింజలు నిజంగా కడుపులోని పురుగులను చంపడంలో సహాయపడతాయా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
టాక్సోకారియాసిస్, పిన్‌వార్మ్స్, అస్కారియాసిస్ వంటి గుండ్రని పురుగులు, అంటే కడుపు పురుగులు, ప్రేగులలో సంభవిస్తాయి. ఈ పురుగులు కొన్ని వారాల నుండి రెండు సంవత్సరాల వరకు శరీరం లోపల జీవించి ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేయగలవు. మురికి కారణంగా, ఇవి చేతుల ద్వారా సులభంగా కడుపులోకి చేరుతాయి. దీనితో పాటు, చెడిపోయిన ఆహారం, మురికి నీరు, సరిగ్గా ఉడికించని మాంసం తినడం వల్ల కూడా కడుపులో పురుగులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో బొప్పాయి గింజలను కడుపులోని పురుగులను తొలగించే సహజ చికిత్సగా పరిగణిస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. 2007లో నైజీరియాలో 60 మంది పిల్లలపై నిర్వహించిన అధ్యయనంలో, బొప్పాయి గింజలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. బొప్పాయి గింజలు తిన్న 71 శాతం మంది పిల్లల కడుపులోని పురుగులు మలవిసర్జన ద్వారా తొలగించబడ్డాయని అధ్యయనం తెలిపింది.
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ MD క్రిస్టీన్ లీ మాట్లాడుతూ, తక్కువ సంఖ్యలో వ్యక్తులపై చేసిన ఇటువంటి అధ్యయనాలను నమ్మలేమని చెప్పారు. బొప్పాయి గింజలను పెద్ద మొత్తంలో తినడం ఆందోళన కలిగించే విషయం కాబట్టి, దీని కోసం పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.. డాక్టర్ లీ ప్రకారం, బొప్పాయి గింజల్లో కొంత మొత్తంలో సైనైడ్ ఉంటుంది. ఇది హానికరమైన సహజ రసాయనం, దీనిని పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మీ కడుపులో పురుగులు ఉన్నాయని, దాని వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారని మీకు అనిపిస్తే, సోషల్ మీడియాలో చికిత్స కోసం వెతకడానికి బదులుగా, వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. విరేచనాలు, వికారం, ఆకస్మిక బరువు తగ్గడం, రక్తస్రావం, రక్తహీనత,యు కడుపులో అధిక వాయువు ఏర్పడటం అనేవి మీ కడుపులో పురుగులు ఉన్నాయని, ఇవి ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తున్నాయని సూచించే లక్షణాలు.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. అయితే, ఈ లక్షణాలు ఇతర కడుపు సంబంధిత సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు. అందువల్ల, సరైన చికిత్స కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..