దీంతో డార్లింగ్ ఏ పాత్రలో నటిస్తున్నారు.. అసలు ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా చెప్పినట్లుగా ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో డార్లింగ్ రుద్ర పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. విడుదలైన పోస్టర్ ను చూస్తే.. ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. మెడలో రుద్రాక్షలు, కాషాయ దుస్తులు, పెద్ద జుట్టుతో కనిపించారు. “ప్రళయ కాలరుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో.. మస్తాన్ సాయి అరెస్ట్
అమ్మకానికి పులి మూత్రం.. ఒక్క సీసా ఎంతో తెలుసా ??
Palmyra Sprout: తేగలతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!