కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. సుదీప్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుదీప్.. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అటు హీరోగా అలరిస్తునే.. ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ప్రస్తుతం సుదీప్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కన్నడలో బిగ్ బాస్ షోకు గెస్ట్ గాను అలరిస్తున్నాడు సుదీప్. కాగా ఇటీవలే తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ఇతర భాషలోని నటీనటులు కూడా సుదీప్ కు ధైర్యం చెప్పారు.. ఇదిలా ఉంటే సుదీప్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో సుదీప్ తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోయిన్ గురించి మాట్లాడాడు.
ఈ వీడియో ఇప్పుడు తెగ వైరాల్ అవుతుంది. ఈ వీడియోలో ..సమంత, నయనతార, సాయి పల్లవి లేదా తమన్నా. వారిలో మీకు ఇష్టమైన వారు ఎవరు.?’ అని యాంకర్ అడగ్గా.. సమంత అని చెప్పాడు కిచ్చ సుదీప్. ‘సమంత ఎప్పుడూ నా ఫేవరెట్. ఆమె ఒక స్వీట్ గర్ల్. తన సినిమాలు నేను చూస్తుంటాను. అద్భుతంగా నటిస్తుంది. ఆమె తనను తాను మరింత అందంగా, ప్రొఫెషనల్ గా మార్చుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈగ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుదీప్. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. ఈగ మూవీ షూటింగ్ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలాగే బాహుబలి సినిమాలోనూ సుదీప్ చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు సుదీప్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్నాయి.
సమంత ఇన్ స్టా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి