మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతోంది భారత రైల్వే శాఖ. అలాంటి మహకుంభ్ స్పెషల్ ట్రైన్‌ని స్టేషన్‌లోనే ఆపి లోకో పైలట్ వెళ్లిపోయాడు. దాంతో కొన్ని గంటలపాటు రైలు స్టేషన్‌లోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. చివరకు డిపార్ట్‌మెంట్ నుండి మరో లోకో పైలట్‌ని పిలిపించారు. ఆ తర్వాత గానీ, రైలు ముందుకు కదిలింది. అయితే, ముందుగా రైలును నడపాల్సిన లోకో పైలట్ రైలును ఎందుకు విడిచిపెట్టి వెళ్లాడో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…?
ప్రయాగ్‌రాజ్-వారణాసి మహాకుంభ్ ప్రత్యేక రైలుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీర్జాపూర్‌లోని నిగత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో లోకో పైలట్ మహాకుంభ్ ప్రత్యేక రైలును ఆపి వెళ్లిపోయాడు. తాను 16 గంటల పాటు రైలును నడిపానని, దీంతో అలసిపోయానని చెప్పాడు.. అలసట కారణంగా అతను ఇకపై రైలును నడపలేనని వెళ్లిపోయాడు.. వాస్తవానికి లోకో పైలట్ రైలును ఆపి స్టేషన్ మాస్టర్‌కు మెమో ఇచ్చి రైలును నడపడానికి నిరాకరించాడు. దీంతో స్టేషన్ మాస్టర్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. మూడు నాలుగు గంటలపాటు రైలు నిలిచిపోవడంతో స్టేషన్ మాస్టర్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఎస్పీకి సమాచారం అందించారు.
ఎస్పీ పోలీసు బలగాలను పంపి ప్రయాణికులను శాంతింపజేసి వారణాసి నుంచి మరో లోకోపైలట్‌ను రప్పించారు..ఆ తరువాత రైలు ముందుకు సాగింది. మహాకుంభానికి ప్రత్యేక రైలు నడపడం వల్ల లోకోపైలట్‌పై ఒత్తిడి పెరిగి అదనపు డ్యూటీ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
కచ్వాన్ పోలీస్ స్టేషన్‌లోని నిగత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 00537 మహాకుంభ్ ప్రత్యేక రైలు ప్రయాగ్‌రాజ్ నుండి కాశీ వారణాసికి వస్తోందని చెప్పారు. నిగత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసిన తర్వాత లోకో పైలట్ కిందకు దిగిపోయాడు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..