క్యాన్సర్ మహమ్మారి ఎంత మంది ప్రాణాలు తీస్తోందో ఎన్నో రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వికల్ క్యాన్సర్‌ని అరికట్టేందుకు కృషి చేస్తోంది. అయితే.. క్యాన్సర్ వచ్చిందంటే..ట్రీట్‌మెంట్ ఓ నరకం. పైగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. సామాన్యులకు ఇలాంటి జబ్బులు వస్తే వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. క్యాన్సర్‌కి సంబంధించిన మందుల ధరలూ భారీగానే ఉంటాయి. మొత్తంగా…ఈ జబ్బు ప్రజల్ని శారీరకంగానే కాకుండా.. ఆర్థికంగానూ దెబ్బ తీస్తోంది. అందుకే..కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఆ మేరకు వాటి ధరలు తగ్గుతాయి. ఫలితంగా అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు. క్యాన్సర్ బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో