చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

3 hours ago 3

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇందుకోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నెయ్యి ఒకటి. ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పోషకాహార నిపుణులు చలికాలంలో నెయ్యిని తప్పనిసరిగా ఏదో రూపంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Jan 19, 2025 | 7:06 AM

చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని భయపడుతుంటారు. కానీ, రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  
నెయ్యి తినడం వల్ల శరీరానికి శక్తి స్థిరంగా అందుతుంది. నెయ్యి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నెయ్యిలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే బాడీని హైడ్రేట్ చేస్తాయి. అందుకే మీ వింటర్ డైట్లో కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే.

చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని భయపడుతుంటారు. కానీ, రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి తినడం వల్ల శరీరానికి శక్తి స్థిరంగా అందుతుంది. నెయ్యి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నెయ్యిలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. అలాగే బాడీని హైడ్రేట్ చేస్తాయి. అందుకే మీ వింటర్ డైట్లో కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే.

1 / 5

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఉండదు. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. నెయ్యిలో తగినంత కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి నడవడం తేలికవుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2 / 5

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. నెయ్యిని తినడం వల్ల స్త్రీలకు రుతుస్రావ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

3 / 5

గర్భిణిలు నెయ్యి తీసుకోవడం చాలా మంచిదని చెబుతారు. నెయ్యి రోజూ తీసుకోవడం వల్ల వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నెయ్యిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంపై అయిన గాయాలు, పుండ్లను తొందరగా తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 5

నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయిన విటమిన్ ఎ, ఇ ఉంటాయి. ఇవి కంటిచూపు, చర్మ సౌందర్యం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. అనేక పోషకాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. నెయ్యిలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి బాడీలో వివిధ రకాల మంట, వాపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article