DeepSeek R1 పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్..వచ్చీ రాగానే అన్ని చోట్లా రీసౌండ్ చేస్తోంది. ఇన్ని రోజులు AI లో తోపు అనుకుంటున్న ఛాట్‌జీపీటీని సింపుల్‌గా పక్కన తోసేసింది ఈ డీప్‌సీక్. అసలు సిసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా..? ఇంత సంచలనం సృష్టించిన ఈ కంపెనీ ఓ స్టార్టప్. సంస్థ మొదలై జస్ట్ ఏడాది అవుతోందంతే. కానీ…ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సెక్టార్‌నే మలుపు తిప్పగలిగే స్థాయిలో పేరు సంపాదించుకుంది డీప్‌సీక్ కంపెనీ. దీని గురించి మరో హైలైట్ కూడా చెప్పుకోవాలి. యాపిల్ స్టోర్ డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్స్ అన్ని యాప్స్‌నీ వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే…ఈ డీప్‌సీక్ దెబ్బకి మార్కెట్‌లో కొన్ని టెక్ స్టాక్స్ కూడా చతికిలబడ్డాయి. జనవరి 20వ తేదీన రిలీజైన ఈ AI మోడల్..ప్రపంచంలోని టెక్ ఎక్స్‌పర్ట్స్ దృష్టిని చాలా సులువుగా, వేగంగా తన వైపు తిప్పుకుంది. AI తయారు చేసిన ఛాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పుడే అంతా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంటుందా అనుకున్నారు. పైగా.. దాని పని తీరు చూసి ఫ్లాట్ అయిపోయారు. ఏం అడిగినా సరే..క్షణాల్లోనే సమాధానం చెప్పేస్తుంది ఛాట్‌జీపీటీ. కంటెంట్ ప్రొడ్యూస్ చేసే వాళ్లకి చాలా హెల్ప్ అవుతోంది. ఎవరు ఎలా వాడితే..వాళ్లకు అలా ఉపయోగపడుతోంది చాట్‌జీపీటీ. అందుకే మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. పైగా మొట్టమొదటి AI మోడల్ కావడం వల్ల అటెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి అంతా అలవాటుపడిపోయారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: