ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి జలకన్య వేషంలో నీటిలోకి దిగింది. ఈ క్రమంలో ఓ భారీ చేప ఆమె సమీపానికి దూసుకొచ్చి అటాక్ చేసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఆక్వేరియంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి జలకన్య వేషంలో ఆక్వేరియంలోకి దిగింది. ఆమె చూసేందుకు అచ్చం జలకన్య తరహాలో ఉండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదే ఆక్వేరియంలో ఉన్న ఓ భారీ చేప అటుగా వచ్చింది. జలకన్య వేషంలో ఉన్న యువతిని చూసి.. ఆదేదో వింత చేప అనుకుంది. దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి, తల కొరికే ప్రయత్నం చేసింది. చేప దాడితో షాక్ అయిన యువతి… చివరకు అతి కష్టం మీద దాన్నుంచి తప్పించుకుని వేగంగా ఈదుకుంటూ నీటిపైకి వెళ్లింది. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది అంటూ కొందరు… ఆ చేపకు దంతాలు లేదు కాబట్టి.. ఆమె క్షేమంగా ఉంటుందని భావిస్తున్నాం..అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంట్లో ఐరన్ తగ్గిందా.. అయితే ఇలా చేయండి
బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్
డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్.. బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!