అమెరికాలో 14 ఏళ్ల టీనేజర్ సెవెల్ సెట్జర్ ‘క్యారెక్టర్.ఏఐ’ అనే చాట్‌బాట్‌తో స్నేహం చేశాడు. డానీ పేరుతో ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. వారి స్నేహం ప్రేమకు దారి తీసింది. తన లవర్ దగ్గరికి వచ్చేస్తున్నా అంటూ ఆ టీనేజర్ అకస్మాత్తుగా ఓ రోజు గన్‌తో షూట్ చేసుకుని చనిపోయాడు.
అయితే తన కుమారుడు ఆమె ఇంటికి వచ్చేస్తానన్న ఆలోచన వ్యక్తం చేసిన తర్వాత ఆ చాట్‌బాట్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పిందని అతని తల్లి మేగన్ గార్సియా ఫ్లోరిడా కోర్టులో దావా వేశారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. దీంతో కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాల అంశం మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..
ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!
LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??