అసలు అటువంటి డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడాన్నే ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. అది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టపరమైన నిబంధనలు పూర్తి చేయలేదని పేర్కొంది. రోజువారీ అమెరికన్ల ప్రయోజనాల కోసం పనిచేయని వారు డోజీలో సభ్యులుగా ఉన్నారని దీనిలో ఆరోపించారు. వారు ప్రభుత్వ ఏజెన్సీల వ్యయనియంత్రణలను సూచిస్తుంటారని ఆ సంఘం పేర్కొంది. వాస్తవానికి ఫెడరల్ నిబంధనల ప్రకారం కమిషన్ లేదా టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి.. ప్రైవేటు రంగం నుంచి సూచనలు స్వీకరించవచ్చని గుర్తు చేసింది. మరోవైపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్స్‌ను ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడం.. ఫెడరల్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లను ఆధునీకరించడం వంటివి దీనిలో ఉన్నాయి. దీనికి మస్క్‌ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. డోజ్ సభ్యులను కూడా కేటాయించేలా ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: చేపల పులుసు వండి వడ్డించిన నాగ చైతన్య
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన
మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ