నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు, కారు, ఇతర ఆస్తులు కలిగి ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం రాత్రిపగలు కష్టపడుతుంటారు. పైసా పైసా కూడబెట్టి అనువైన ప్రదేశంలో తక్కువ ధరలో కోరుకున్న ఇల్లు, ఇతర ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఆస్తి లావాదేవీలకు సంబంధించి షాకింగ్ కథనాలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా అమెరికా నుండి అలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 75 కోట్ల విలువైన ఆస్తిని కేవలం 875 రూపాయలకు కొనుగోలు చేయగల అవకాశం వచ్చింది. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటంటే..
అమెరికాలో ఆస్తి లావాదేవీలకు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.875కే రూ.75 కోట్ల విలువైన హోటల్ అమ్మకానికి వచ్చింది. కొలరాడోలోని డెన్వర్‌లో ఉన్న 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 75 కోట్లు) విలువైన ఒక హోటల్ కేవలం 10 లక్షల డాలర్లకు (రూ. 875) అమ్ముడవుతోంది. అయితే, దీని వెనుక ఓ షరతు ఉంది. కొనుగోలుదారు మొత్తం భవనాన్ని పునరుద్ధరించి, నిరాశ్రయులైన ప్రజలకు దానిని అందుబాటులోకి తీసుకురావాలి.. ఈ హోటల్‌ను 2023లో $9 మిలియన్లకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు, అది నిరుపయోగంగానే ఉంటోంది. అందువల్ల ఈ ఆస్తిని మళ్ళీ ఉపయోగించుకునేలా చేయగల కొత్త యజమాని కోసం వెతుకుతున్నారు.
ఇప్పుడు ఈ హోటల్ ఒప్పందం గురించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ హోటల్ కొనుగోలు చేయడానికి ప్రజల నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయి. డెన్వర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్‌బరీ ప్రకారం, ఈ హోటల్ పునర్ నిర్మాణం, పూర్వ వైభవాన్ని తీసుకురాగల ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది. దరఖాస్తుదారులను సమీక్షిస్తున్నారు. ఈ ఆస్తికి కొత్త యజమానిని నిర్ణయించినప్పుడు ఒప్పందాన్ని నగర కౌన్సిల్ ఆమోదించింది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే, ఇక్కడ నిరాశ్రయులకు ఇళ్ళు నిర్మించే పని ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..