పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న నటి ఓ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. తన అందం, నటనతో అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాధించుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ ఆ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.అంతే కాదు ఈ ముద్దుగుమ్మ తాత,మామ మాజీ ప్రధానమంత్రులు. ఈ బ్యూటీ ఎవరు. ఆ అమ్మడి తాత,మామ ఎవరు? అనేది చూద్దాం.!
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు అదితి రావు హైదరి. ఈ చిన్నదానికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. చిన్న వయసులోనే వివాహం చేసుకుంది అదితి. కానీ ఆ వివాహబంధం ఆరు సంవత్సరాలకే ముగిసింది. ఆమె ఇటీవల నటుడు సిద్ధార్థ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
అదితి రావు హైదరి ఒక రాజ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ. అప్పట్లో ఆయన హైదరాబాద్ కు ప్రధానమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా, మరొక తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తికి చెందినవారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, అదితికి దగ్గరి బంధువు. అదితికి రెండేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అందుకే ఆమె తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చింది. ఈ ముద్దుగుమ్మ 2006 లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తరువాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించింది. అదితి ఎక్కువగా మణిరత్నం చిత్రాలలో కనిపించింది. సిద్ధార్థ్, అదితి కలిసి ‘మహాసముద్రం’ సినిమాలో నటించారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అదితి గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కాగా 2022 నుండి ఈ బ్యూటీ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. కమిట్ అయిన సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి