జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని చెప్పారు. తమ మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి. కానీ, ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్‌గా అనిపిస్తోందనీ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి అదే నెల 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఇద్దరూ ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సాయం కోరినట్లు ‘స్పేస్ ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. త్వరలో ఈ పనిని పూర్తిచేస్తామని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. వారిద్దరినీ తిరిగి భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడికి ఊహించని షాక్..ఏం జరిగిందంటే ??
భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే
శాంతించిన బంగారం.. గోల్డ్ ధర ఎంతో తెలుసా ??