ఇంగ్లాండ్‌కు చెందిన ఈ వార్త నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ గామా గ్రిఫిత్స్ అనే మహిళ ఒక రోజు తన గోళ్లకు నెయిల్ పాలిష్ చేసుకుంటోంది. ఈ సమయంలో తన ఐదేళ్ల కూతురు ఆమె పక్కనే ఉంది.. తల్లి నెయిల్ పాలిష్ వేసుకుంటుండగా, ఏం జరిగిందో తెలియదు గానీ, ఉన్నట్టుండడి ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అది గమనించిన ఆ తల్లి వెంటనే చిన్నారికి CPR చేసింది. అయినా లాభం లేకపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు చిన్నారి కోమాలోకి వెళ్లిందని చెప్పారు.
తొలుత పాపకు ఏం జరిగిందో వైద్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారట. వెంటనే బాలికకు CT-SCAN చేసారు. ఈ సమయంలో బాలికకు రెండవసారి గుండెపోటు రావటం గుర్తించారు. బాలిక పరిస్థితిని చూసిన వైద్యులు చాలా ఆశ్చర్యపోయారు. చికిత్స సమయంలో ఎల్లా-మేకి కేటెకోలమినెర్జిక్ పాలిమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (CPVT) అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో గుండె కొట్టుకోవడంలో మార్పులు, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
దీంతో వైద్యులు చిన్నారి తల్లిని విచారించగా.. ముందు రోజు రాత్రి జరిగిన హాలోవీన్ పార్టీలో చిన్నారి బాగా అలసిపోయిందని గుర్తించారు. చిన్నారిని ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స అందించారు. కొన్ని వారాల తర్వాత చిన్నారికి హార్ట్ సర్జరీ చేశారు. ఇందులో బాలిక గుండె దగ్గర ఉన్న సిరను కోసి అందులోకి అడ్రినలిన్ ఇంజెక్ట్ చేశారు. తద్వారా డెపోటు ప్రభావాలు తగ్గి, అమ్మాయికి కొత్త జీవితం లభిస్తుందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఎప్పటికప్పుడు ఆమెను హార్ట్ కంట్రోల్ మెషీన్ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..