బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్‌ షేక్ అవడం పక్కా.. అంతే

2 hours ago 1

బన్నీ కోసం రంగంలోకి స్త్రీ2 హీరోయిన్.. ఇక నార్త్‌ షేక్ అవడం పక్కా.. అంతే

|

Updated on: Oct 22, 2024 | 12:05 PM

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప 2. సుమారు మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్ ఇది. ఐకాన్ స్టార్ హీరోగా నటిస్తోన్న ఈ క్రేజీ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ పుష్ప సీక్వెల్ పై అంచనాలను పెంచేశాయి.

ఇక పుష్ప పార్ట్‌ 1 సక్సెస్ లో సమంత స్పెషల్ సాంగ్ కు కూడా భాగముంది. ఊ అంటావా మావా అంటూ ఆమె వేసిన హుషారైన స్టెప్పులు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్‌ 2లోనూ స్పెషల్ సాంగ్ విషయంలో అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ను పుష్ప2 కోసం రంగంలోకి దించేస్తున్నారట. పుష్ప2లో ఐటెం సాంగ్ చేస్తోందంటూ.. ఆ మధ్యన దిశా పటానీ పేరు వినిపించింది. అలాగే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు కూడా బయటికి వచ్చింది. అయితే ఇవేవీ నిజం కాదన్నట్టు.. ఇప్పుడు ఫైనల్ గా స్త్రీ2 హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ పుష్ప2లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం నార్త్ హీరోయిన్ ను పెడితే బాలీవుడ్ లో మూవీకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట మేకర్స్ . అందులో భాగంగానే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శ్రద్ధాకపూర్ ను ఈ పాట కోసం సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శోభిత ఇంట..పెళ్లి పనులు మొదలయ్యాయి..

TOP 9 ET News: రామ్ చరణ్‌ పాటకు కొరియన్ స్టార్ట్స్ క్రేజీ డ్యాన్స్

పశువుల పాకలోకి వెళ్లిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి షాక్‌

మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం

ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article