సాంప్రదాయంగా ఆధ్యాత్మికత కోరుకునే భక్తుల కోసం కుంభమేళలో విలాసవంతమైన వసతులు ఏర్పాటు చేశారు. VIPల కోసం హోటళ్ళు, కాటేజీలు, టెంట్‌లతో పాటు, డోమ్ అనే కొత్త వసతి సౌకర్యాన్ని ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని హంగులు, సౌకర్యాలు ఉండడం విశేషం.ఫైవ్ స్టార్ ఆతిథ్యంతో పాటు హెలికాప్టర్ రైడ్‌లు కూడా అందుబాటులో ఉంచారు. ఎలైట్ కుంభ్‌లోని సంగ్రహావలోకనం రద్దీగా ఉండే ఘాట్‌లకు, సాధారణ యాత్రికుల తాత్కాలిక గుడారాలకు దూరంగా ఓ ప్రపంచాన్ని నిర్మించింది,
డోమ్ వసతి..మహా కుంభ్‌లో ఇదే అత్యంత ఖరీదైన వసతి. 5 స్టార్ హోటల్‌లో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు. డోమ్ అద్దె విని షాక్ అవ్వాల్సిందే. షాహి స్నానం రోజున లక్ష 11వేలు, మిగతా రోజుల్లో 81 వేలు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం 51 కోట్లు ఖర్చు చేసింది ఓ కంపెనీ.
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ 2025 సందర్భంగా డోమ్ సిటీ అనే ప్రత్యేక ఏర్పాటు చేశారు. భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో గుమ్మటం ఆకారంలో డోమ్‌ల నిర్మాణం ఉంది. గాజు పలకలు, కర్టెన్లు ఏర్పాటు చేశారు. కర్టెన్లు తొలగిస్తే లోపల నుంచే మహా కుంభ్ దృశ్యాలు కనువిందు చేసేలా రూపొందించారు. డోమ్ సిటీని చూసి వావ్ అంటున్నారు. ఎన్నో కుంభ మేళాలను చూశాం..కానీ ఇంతలా ఉంటుందని ఊహించలేదంటున్నారు కొందరు.లగ్జరీ అంటే లగ్జీరీ కాదు… దుబాయ్ నుంచి ఓ ఫ్యామిలీ ఏకంగా ఒక రాత్రికి 50వేలు చెల్లించి టెంట్ బుక్ చేసుకుంది.
ఇక గంగా, యమున, సరస్వతి సంగమానికి ప్రైవేట్ బోట్ రైడ్‌లు అలరిస్తున్నాయి. సంగమాల్లో VIPల ఏకాంత స్నానాకి 5 వేల నుంచి 10వేల చార్జ్ చేస్తున్నారు. విలాసవంతమైన డేరా నగరాలు, స్విస్-శైలి చాలెట్‌లు, ఎన్‌సూట్ బాత్‌రూమ్‌లు, ఆల్ యు కెన్ ఈట్ బఫేలు, స్పా ట్రీట్‌మెంట్‌లు కూడా ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ మరియు ఫైర్ ప్రూఫ్ పాలికార్పొనేట్‌తో నిర్మాణాలు చేశారు. డోమ్ సిటీ, ఒక రాత్రికి రూ.1 లక్షతో హైటెక్ బస, ప్రత్యేకమైన రెస్టారెంట్‌లు, సాత్విక్ బఫేలు ఉంటాయి.
పలు ప్రైవేట్ కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లగ్జరీ కాటేజ్‌లు, డోమ్ సిటీలు ఏర్పాటు చేశాయి. ఇలా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించించి కేవలం ఆతిథ్య రంగంలో 2వేల 500 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు మహా కుంభ్ ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.