రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక మలుపుతిరుగుతోంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అని లావణ్య ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ రచ్చ చాలా రోజుల నుంచి సాగుతోంది. ఈ కేసు తీగ లాగితే దాని డొంక ఎక్కడ నుంచో కదులుతోంది. రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు కూడా తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మస్తాన్ సాయి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది.
Raj Tarun, Lavanya
లావణ్య-రాజ్‌తరుణ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. లావణ్య-రాజ్‌తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. పలువురు యువతుల వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. అలాగే లావణ్య వీడియోలను కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోలాను లావణ్య పోలీసులకు అందించారు. అంతేకాదు హార్డ్‌డిస్క్ కోసం లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ హార్డ్‌డిస్క్ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దాంతో మస్తాన్ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది లావణ్య. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు.
అలాగే మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 300లకు పైగా వీడియోలను గుర్తించారు పోలీసులు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. మస్తాన్ సాయి అరెస్ట్ తో వెలుగులోకి వచ్చిన అశ్లీల వీడియోల వ్యవహారం. వందలమంది అమ్మాయిల వీడియోలు తీశాడు మస్తాన్‌సాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వలవేసి .బెడ్‌రూమ్స్‌లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశాడు. అంతే కాదు అమ్మాయిల న్యూడ్ వీడియోకాల్స్ రికార్డ్ చేశాడు ఈ కేటుగాడు. మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 300 మంది యువతుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటితో పాటు.. యువతులను డ్రగ్స్‌కు బానిసలుగా చేశాడు. యువతులను వీడియోలతో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. మస్తాన్ సాయితో పాటు ఖాజాను అరెస్ట్ చేశారు పోలీసులు.
రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మస్తాన్ సాయి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. మొదట్లో మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అని చెప్పిన లావణ్య ఆ తర్వాత అతని పై కేసు పెట్టింది.. గతంలో గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో 2023లో లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి పై కేసు నమోదైంది.
లావణ్యకు మస్తాన్ అనే వ్యక్తితో సంబంధం ఉందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేశాడు. ఆతర్వాత మస్తాన్ సాయి పై లావణ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. మస్తాన్ సాయి దగ్గర తన ప్రైవేట్ వీడియో ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు రమ్మన్నాడని. పెళ్ళికి వచ్చిన తనను ఓ హోటల్ లో ఉంచాడ ని. అదే సమయంలో తాను హోటల్‌లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి కొట్టి తనఫోన్ లాక్కొని అత్యాచారయత్నం చేసినట్లు లావణ్య ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. ఇక ఇప్పుడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి