టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇవ్వాళ అంటే ఫిబ్రవరి 04న హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను ఆఫీస్‌కు వెళ్లారు. గతనెలలో దిల్‌రాజు, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారుల నోటీసులు అందుకున్నారు దిల్‌రాజు.
ఈ క్రమంలోనే మంగళవారం ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో ఎంక్వైరీకి వెళ్లారు దిల్ రాజు. సంక్రాంతికి రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన లెక్కలతోపాటు.. కొన్నేళ్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి సంబంధించిన లావాదేవీలపై IT టీమ్ ఫోకస్ పెట్టింది. తమ అకౌంట్లన్నీ పారదర్శకంగానే ఉన్నాయని చెప్తున్న దిల్ రాజు.. నాడు నోటీసుల సందర్భంగా ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన వివరాలతో ఆయకార్ భవన్‌కి వెళ్లారు. ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజు ఇంటిపై దాడులు నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: